ETV Bharat / state

SARPANCH DEMAND: 'వారిపై కాదు.. నాపై కేసులు నమోదు చేయండి'

సమస్య పరిష్కారం కోసం సర్పంచి వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. స్పందించిన అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. మరోవైపు సర్పంచి నిరసనకు మద్దతు తెలిపిన ప్రజలపై పోలీస్ స్టేషన్​లో కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

sudha yadav
సర్పంచి బడి సుధాయాదవ్
author img

By

Published : Sep 3, 2021, 5:23 PM IST

చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం పుదిపట్ల గ్రామపంచాయతీ సర్పంచి బడి సుధాయాదవ్ రోడ్డుపై నిలిచిన బురద నీటితో స్నానం చేస్తూ.. రోడ్డు మరమ్మతులను చేపట్టాలని గత నెల 28వ తేదీన నిరసన కార్యక్రమం చేపట్టారు. సంవత్సరాలుగా పరిష్కారం దొరకని ఈ సమస్యకు ఒక్క నిరసనతో అధికారులు దృష్టికి చేరింది. మూడు రోజుల క్రితం తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆర్ అండ్ ​బీ అధికారులతో మాట్లాడి మరమ్మతులు చేపట్టారు.

మరోవైపు సర్పంచి చేసిన నిరసనకు మద్దతు తెలిపిన ప్రజలపై ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్​లో కేసులు నమోదయ్యాయి. వీటిపై ఆసహనం వ్యక్తం చేసిన సర్పంచి సుధా యాదవ్.. తనకు మద్దతు తెలిపిన వారిపై కాకుండా.. తనపై కేసులు నమోదు చేయాలని పోలీసులు కోరారు. ఈ నిరసనకు మూలకారణం తానేనంటూ సాక్ష్యాధారాలను పోలీసులకు చూపించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిరసన తెలిపితే... కేసులు బనాయించటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రాజకీయ నాయకుల అండదండలతో ప్రజలపై కాంట్రాక్టర్లు కేసులు పెట్టారని ఆరోపించారు.

ఇదీ చదవండి్

PROTEST: బురద నీటితో స్నానం.. అధికారుల తీరుపై సర్పంచ్ గరం గరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.