పాత పెన్షన్ విధానం తీసుకురావాలి: ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు - పాత పెన్షన్ విధానం తీసుకురావాలి
నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకురావాలని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఆలిండియా గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సమావేశానికి దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వంద మంది ప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పాత పెన్షన్ విధానం తీసుకురావాలి: ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు