bjp leader bhanu: తితిదే నిబంధనలకు విరుద్దంగా ప్రత్యేక ఆహ్వానితులను ప్రభుత్వం నియమించిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయి విమర్శలు చేశారు. 568, 569 ఉత్తర్వులను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసిందన్నారు. ఫిబ్రవరి 11న ఎందుకు ఆర్డినెన్స్ జారీ చేశారని.. ఆర్డినెన్స్ ద్వారా తితిదే ధర్మకర్తల మండలి సభ్యులతో సమానంగా హోదా కల్పించారని ఆయన ఆరోపించారు.
తితిదే ధర్మకర్తల మండలిని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని.. హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఆర్డినెన్స్ ఉపసంహరించకపోతే ఉద్యమం చేస్తామన్నారు. ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానాలపై శ్రీవారి భక్తులతో కలిసి ఉద్యమాలను తీవ్రం చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: