చిత్తూరు జిల్లావ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. జిల్లాలోని మదనపల్లిలో వామపక్ష పార్టీలతో పాటు.. ప్రజా సంఘాలు ఇందులో పాల్గొన్నాయి. ఉదయం నుంచే నిరసనకారులు రోడ్లపైకి వచ్చి దుకాణాలను మూసివేశారు. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
శ్రీకాళహస్తిలో
శ్రీకాళహస్తిలో భారత్ బంద్ కొనసాగుతోంది. తేదేపా, సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపారులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్కు సంఘీభావం తెలిపారు.
ఇదీ చదవండి:
ఎనిమిదేళ్ల క్రితం అదృశ్యం..మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ విచారణ