ETV Bharat / state

కేంద్ర ప్రభుత్వ ఆలోచనతో ఏకీభవిస్తున్నా: చంద్రబాబు

ఐదు ట్రిలయన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనతో... తాను ఏకీభవిస్తున్నట్టు తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ అంశంపై త్వరలోనే ఓ నివేదిక విడుదల చేస్తామన్నారు. చిత్తూరు జిల్లాలో 3 రోజుల పర్యటన ముగిసిన అనంతరం మాట్లాడిన ఆయన... రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అనేక విధానాలను ఎండగట్టారు. తమ కార్యకర్తలపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టి వేధించినా భయపడబోమన్నారు.

చంద్రబాబు
author img

By

Published : Nov 9, 2019, 6:43 AM IST

చంద్రబాబు

భారతదేశం ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమి దేశంగా మారడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని... ఈ అంశంపై ప్రధాని, కేంద్రం చేస్తున్న ప్రకటనతో ఏకీభవిస్తానని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమిపై తమ అభిప్రాయాలతో ఓ డాక్యుమెంట్‌ విడుదల చేస్తామన్నారు. చిత్తూరు జిల్లాలో 3 రోజుల పర్యటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాతృభాషను కాపాడుకోకపోతే... తెలుగు జాతి ఉనికికే ప్రమాదమని ఆవేదన వ్యక్తం చేశారు.

తగినంత సన్నద్ధత లేకుండానే ఆంగ్లభాషలో విద్యాబోధన ఉత్తర్వులు ఇవ్వడం తొందరపాటు నిర్ణయమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అగ్రిగోల్డ్‌ వివాదంపై సీఎం జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాత వారసత్వంగా... ఫ్యాక్షన్‌ విధానాలను పునికి పుచ్చుకున్న జగన్‌... తన ప్రత్యర్థుల ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా... తెదేపా కార్యకర్తలు, నేతలు భయపడరని పేర్కొన్నారు.

ఇదీ చదవండీ... ధారలు కట్టిన రక్తం మాటున... మాంసం ముద్దలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.