చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు గ్రామంలోని గోల్డెన్ వాలీ కళాశాలలో ప్లాస్టిక్ నిషేదంపై ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల సిబ్బంది ప్లాస్టిక్ వలన కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడదాం అంటూ విద్యార్థులతో పాటు నినాదాలు చేశారు. ప్లాస్టిక్ విడుదలపై గ్రామస్థాయి నుంచి ఉద్యమం చేపట్టాలని కళాశాల నిర్వాహకులు, అధ్యాపకులు, విద్యార్థులు నిర్ణయించారు.
ఇదీ చూడండి: ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వద్దు... పర్యావరణమే ముద్దు