చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయం.. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈనెల 6 నుంచి పది రోజులపాటు జరగనున్న ఈ ఉత్సవాలకు సంబంధించి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ శిఖరాలతో పాటు మాడవీధుల్లో విద్యుత్ దీపాల అలంకరణ చేపట్టారు. ఆలయాన్ని రంగవల్లులతో ముస్తాబుచేశారు. స్వామిఅమ్మవార్లు ఉత్సవ వాహనాలను సిద్ధం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం ధూర్జటి కళా ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు.
ఇదీ చూడండి: కుంభమేళాలో కొనసాగుతున్న విశాఖ శారదాపీఠం సేవలు