చిత్తూరు జిల్లా తిరుపతి ఎస్వీ వెటర్నరీ విశ్వవిద్యాలయం వేదికగా శనివారం ఉదయం జిల్లాస్థాయి కొవిడ్-19 సమన్వయ కమిటీ సమీక్షా సమావేశం జరగనుంది. మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి సమావేశాన్ని నిర్వహించనున్నారు. జిల్లాలో నమోదవుతున్న కరోనా కేసులు, ఆసుపత్రుల్లో పడకల అందుబాటు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆరోగ్యశ్రీ, బ్లాక్ ఫంగస్ కేసుల్లో ఔషధాలు అందుబాటులోకి తీసుకురావటం, తదితర అంశాలపై చర్చించనున్నారు. జిల్లాస్థాయి సమీక్ష సమావేశాన్ని మంత్రులు నిర్వహించున్నారు. ఇందుకోసం సంబంధించిన చేసిన ఏర్పాట్లను జేసీ వీరబ్రహ్మం, ఆర్డీవో కనకనరసారెడ్డి పరిశీలించారు.
ఇదీ చదవండి..
ఇకపై అలా చేస్తే.. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద కేసులే!