ఇలా చేస్తే పెట్టుబడులు ఎలా? : మంత్రి అమర్నాథ్ రెడ్డి - మంత్రి అమర్నాథ్ రెడ్డి
ఆందోళనలు, ధర్నాలతో పరిశ్రమల యాజమాన్యాలను వైకాపా భయపెడుతోందని మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు.
ఆందోళనలు, ధర్నాలతో పరిశ్రమల యాజమాన్యాలను వైకాపా భయపెడుతోంది: మంత్రి అమర్నాథ్ రెడ్డి
Intro:నవ్యఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో కష్టాలు పడుతోందని..కొత్తగా ప్రారంభించిన పరిశ్రమల యాజమాన్యాలను ఆందోళన, ధర్నాల రూపంలో ఇక్కడి నుంచి తరిమివేయడానికి ప్రతిపక్ష పార్టీ వైకాపా కంకణం కట్టుకున్న ట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. చిత్తూరులోని జిల్లా సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతపురంలో ఇటీవల ప్రారంభించిన కియా కార్ల పరిశ్రమ ఎదుట వైకాపా నాయకులు ధర్నా చేయడం తగదన్నారు. కియా పరిశ్రమలో 86 శాతం వరకు స్థానికులకే ఉపాధి కల్పించినట్లు తెలిపారు. సాంకేతికంగా అవసరమైన సిబ్బంది 14 శాతం వరకు బయటి నుంచి ఇక్కడికి తీసుకోచినట్లు వెల్లడించారు. దీన్ని సైతం ప్రతిపక్ష పార్టీ రాజకీయము చేస్తోందని దుయ్యబట్టారు. గతంలో వోక్స్ వ్యాగన్ పరిశ్రమను ఇదేవిధంగా తరిమివేశారని ఆరోపించారు. ప్రభుత్వం బయట దేశాల కంపెనీలను అడుక్కుని తీసుకొస్తే వైకాపా నాయకులు వారిని బెదిరింపు లకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కియా కార్ల పరిశ్రమ త్వరలో ఎలక్ట్రికల్ కార్ల తయారీని రెండో దిశగా చేపట్టడానికి సిద్ధమైనదని చెప్పారు.
Body:.
Conclusion:.
Body:.
Conclusion:.