చిత్తూరు జిల్లాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అనుమానితుల సంఖ్య పెరగుతున్న పరిస్థితుల్లో స్వాప్స్ నమూనాల సేకరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరోనా అనుమానితుల నమూనాల సేకరణకు అదనపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. తిరుపతి, పీలేరు, నగరి, శ్రీకాళహస్తి, కుప్పం, చిత్తూరు ప్రాంతీయ ఆసుపత్రుల్లో నమూనా సేకరణకు ఏర్పాట్లు జరిగాయి. స్వాప్స్ సేకరణపై వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
ఇవీ చదవండి: