కరోనా కేసులు ఒక్కసారిగా ఎగబాకిన కర్నూలు జిల్లాలో తక్షణమే టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు ప్రయత్నాలు చేపట్టినట్లు మంత్రులు తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో పరిస్థితిని ఎదుర్కోవడంపై అధికారులతో సమీక్షించిన మంత్రులు ఆళ్ల, బుగ్గన... కేవలం దిల్లీ ఘటన కారణంగానే జిల్లాలో ఒక్కసారిగా కేసులు పెరిగాయని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ నమోదైన 56 పాజిటివ్ కేసుల్లో 55 మంది దిల్లీకి వెళ్లి వచ్చిన వారే ఉన్నారన్నారు. కర్నూలులో ల్యాబ్ ఏర్పాటయ్యే వరకూ హైదరాబాద్‌లో పరీక్షలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: