కరోనా రాకుండా ముందస్తుగా ప్రజలకు ఆనందయ్య మందు పంపిణీ పక్కాగా సాగాలని.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధికారులకు సూచించారు. తొండవాడ ముక్కోటి ఆలయం సమీపంలోని నారాయణి గార్డెన్స్‌లో అధికారులతో ఎమ్మెల్యే చెవిరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆనందయ్య ఔషధ తయారీకి కృషి చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వనమూలిలను సేకరించి అందిస్తుండటం అభినందనీయమని కొనియాడారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ఆనందయ్య మందు ప్రతి ఇంటికి చేరేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
నియోజకవర్గ పరిధిలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇకపై కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో కరోనా సెకండ్ వేవ్‌తో పాటు ముంచుకొస్తున్న థర్డ్ వేవ్ గురించి అవగాహన కల్పించి అప్రమత్తంగా ఉండేలా చొరవ తీసుకోవాలని ఆదేశించారు. కొవిడ్ కేర్ సెంటర్లలో పేషెంట్లకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. సేవల్లో ఎటువంటి లోపం ఉండొద్దని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... YSR Bima: సాధారణ మరణానికి రూ.లక్ష.. ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షలు సాయం!