చిత్తూరు జిల్లా మదనపల్లెలో స్థలం వివాదానికి సంబంధించి పోలీసులు పట్టించుకోవట్లేదంటూ విజయ్‌కుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వడ్డేపల్లిలో నివాసముంటున్న అతనికి బంధువులతో ఉన్న స్థల వివాదం ఉంది. వారు తన ఇంటి మీదకు దాడికి వచ్చారని ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా... ఎస్సై ఇదే విషయమై ఘటనా స్థలానికి వెళ్లారని సిబ్బంది చెప్పారు. తన ఇంటికి వచ్చి చూస్తే పోలీసులు ఎవరూ లేకపోవటంతో అసహనం వ్యక్తం చేసిన విజయ్ కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మృతుని బంధువులు పోలీసులకు వ్యతిరేకంగా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వటంతో పరిస్థితి సద్దుమణిగింది.
పోలీసుల నిర్లక్ష్యం... యువకుడి ఆత్మహత్య - suicide
చిత్తూరు జిల్లా మదనపల్లెలో పోలీసుల నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. స్థల వివాదంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రి ఎదుట పోలీసులకు వ్యతిరేకంగా బంధువుల ఆందోళన చేయగా... న్యాయం చేస్తామన్న పోలీసుల హామీతో ఆందోళన విరమించారు.
చిత్తూరు జిల్లా మదనపల్లెలో స్థలం వివాదానికి సంబంధించి పోలీసులు పట్టించుకోవట్లేదంటూ విజయ్‌కుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వడ్డేపల్లిలో నివాసముంటున్న అతనికి బంధువులతో ఉన్న స్థల వివాదం ఉంది. వారు తన ఇంటి మీదకు దాడికి వచ్చారని ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా... ఎస్సై ఇదే విషయమై ఘటనా స్థలానికి వెళ్లారని సిబ్బంది చెప్పారు. తన ఇంటికి వచ్చి చూస్తే పోలీసులు ఎవరూ లేకపోవటంతో అసహనం వ్యక్తం చేసిన విజయ్ కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మృతుని బంధువులు పోలీసులకు వ్యతిరేకంగా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వటంతో పరిస్థితి సద్దుమణిగింది.
Body:కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దారి దోపిడీ దొంగల ను అరెస్ట్ చేసిన పోలీసులు
Conclusion:ఆళ్లగడ్డ పట్టణ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ఆటకట్టించిన పోలీసులు