ETV Bharat / state

పశువుల పండుగలో విషాదం.. ఎద్దు ఢీకొని వ్యక్తి మృతి - జల్లికట్టులో ఓ వ్యక్తి మృతి చెందాడు

One person dies in cattle festival: చిత్తూరు జిల్లా వి.కోట మండలం ఎర్రినాగేపల్లిలో జరిగిన పశువుల పండుగలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఒక ఎద్దు పరిగెత్తుతూ జనం మీదకు దూసుకొచ్చింది. ఈ క్రమంలో సీనప్ప అనే వ్యక్తిని ఢీకొంది. హుటాహుటిన స్థానికులు వి.కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పలమనేరు ఆస్పత్రికి తరలించారు. ఎద్దు ఢీకొన్న ఘటనలో మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు.

Oxe
ఎద్దు
author img

By

Published : Feb 7, 2023, 4:53 PM IST

One person dies in cattle festival: పశువుల పండుగలో విషాదం నెలకొంది. ఎద్దు ఢీకొని సీనప్ప అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వెంకటగిరి కోట మండలం ఎర్రినాగేపల్లిలో జరిగింది. జిల్లాలోని మోర్నపల్లి గ్రామానికి చెందిన సీనప్ప (54) పశువుల పండుగ నిర్వహించే క్రమంలో ఎద్దు ఢీకొని మృతి చెందాడు. అలాగే మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులని వి.కోట ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

మృతుడు సీనప్పకి భార్య, కుమారుడు ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం మృతదేహాన్ని పలమనేరు ఆసుపత్రికి తరలించారు.

ఎర్రినాగేపల్లిలో పశువుల పండుగ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.