చిత్తూరు జిల్లా పెద్ద పంజానీ మండలానికి చెందిన వైకాపా నాయకుడు శ్రీనివాసులుపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. శ్రీనివాసులు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళా వాలంటీర్ ఫిర్యాదు చేసింది. కోర్చిక తీర్చకుంటే వాలంటీర్ విధుల నుంచి తొలగిస్తానని బెదిరింపులకు దిగాడని బాధితురాలు వాపోయింది. దీనిపై ఆధారాలతో సహా మహిళా వాలంటీర్ ఫిర్యాదు చేయగా...పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![ycp leader sexually harassing volunteer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-tpt-37-18-ysrcp-nayakudu-mahilaa-vaalentir-pai-laingika-vedimpulu-av-ap10100_18092020150704_1809f_1600421824_887.jpg)
మండల కార్యాలయంలో వైకాపా నేత శ్రీనివాసులు జులుం ప్రదర్శిస్తున్నాడని కొందరు అధికారులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాలంలో అధికారిక కార్యక్రమాలలో సైతం పాల్గొని...పెత్తనం చలాయిస్తున్నాడని చెప్పారు. ఇదేంటని ప్రశ్నిస్తే తమనే బెదిరిస్తున్నాడని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి