తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి 8 మంది కరోనా వైరస్ బాధితులను డిశ్చార్జి చేసినట్లు... రుయా సూపరింటెండెంట్ భారతి తెలిపారు. ఇందులో ఏడుగురు శ్రీకాళహస్తి, ఒకరు నిండ్రకు చెందినవారు ఉన్నారని వివరించారు. జిల్లాలో మొత్తం 80 పాజిటివ్ కేసులు ఉండగా.. నిన్న 35మంది, ఈరోజు 8 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 37 మంది చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి.. చిత్తూరు జిల్లాలో మరో పాజిటివ్ కేసు నమోదు