ETV Bharat / state

మంచినీరు కావాలంటే... మూడు మైళ్లు నడవాల్సిందే

ఆ గ్రామానికి ఎవరు వెళ్లినా గుక్కెడు మంచినీరు తప్ప ఏవైనా ఇస్తారు. బయటి వ్యక్తులే కాదు... బంధువుల విషయంలోనూ అంతే. ఈ ఊరికి అమ్మాయినిచ్చేందుకూ తల్లిదండ్రులు జంకుతున్నారు. అసలు విషయానికొస్తే... కృష్ణా జిల్లాలోని ఆ మూడు గ్రామాల్లో ఎండలేదు, వానలేదు..ఏ కాలమైనా సరే గుక్కెడు మంచి నీరు దొరకదు. అలా కాదని గ్రామంలో వచ్చేనీటిని తాగామా.... కాటికి కాలు చాపాల్సిందే.  ఆ గ్రామాలేంటి... వారి కష్టాలేంటో చూద్దాం.

మంచినీరు కావాలంటే మూడు మైళ్ల దూరం నడవాల్సిందే
author img

By

Published : Apr 28, 2019, 9:05 AM IST

మంచినీరు కావాలంటే మూడు మైళ్ల దూరం నడవాల్సిందే

వేసవైనా...శీతాకాలమైనా...ఆ గ్రామాల చెరువుల్లో నీటి కొరత ఉండదు. అయినా ఆప్రాంత వాసుల గొంతులు ఎండిపోతున్నాయి. కారణం ఆ నీటి నుంచి వచ్చే దుర్వాసనే. గ్రామ సమీపంలోనే కృష్ణమ్మ పరవళ్లు పెడుతున్నా అక్కడి ప్రజల నీటి కష్టాలను మాత్రం తీర్చలేకపోతుంది. దాహం తీరాలంటే 3 మైళ్లు నడవాల్సిందే. ఇది కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజవకవర్గం కోడూరు మండల పరిధిలోని గ్రామాల పరిస్థితి. కళ్ల ముందే నీళ్లు ఉన్నా తాగటానికి పనికి రాకపోవటంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు అక్కడి ప్రజలు.
కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని పలు గ్రామాల ప్రజలు గుక్కెడు మంచి నీటి కోసం పడని కష్టమంటూ లేదు. కాలం ఏదైనా సరే విశ్వనాథపల్లి, వి.కొత్తపల్లి, జైపురం తదితర గ్రామవాసులు..తెల్లారి లేచింది మొదలు బిందెడు నీళ్ల కోసం పక్క గ్రామాల బాట పట్టాల్సిందే. వేసవి వచ్చిందంటే ఈ కష్టాలు మరింత పెరుగుతాయి. ఈ ప్రాంత వాసులంతా బిందెలు, క్యాన్ లు, బాటిళ్లు పట్టుకుని 3 మైళ్ల దూరంలోని మంచినీటి చేతి పంపు వద్దకు పయనమవుతారు.

అధికారుల నిర్లక్ష్యం..
ఈ గ్రామాల్లో నీటి కష్టాలకు ప్రకృతి పరిణామాలు ఓ కారణమైతే...అధికారుల నిర్లక్ష్యం మరో కారణం. ఏళ్ల క్రితం నిర్మించిన మంచినీటి చెరువులున్నా ప్రయోజనం లేకుండా పోయింది. నీటి విడుదలకు ముందుగానే చెరువులను శుభ్రపరచాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతో తామర మొక్కలు, గుర్రపు డెక్క కేంద్రంగా మారాయి. ఈ పరిస్థితుల్లో కృష్ణా బ్యారేజీ నుంచి నీరు వచ్చి చేరినా అవసరాలు తీర్చలేని పరిస్థితి నెలకొంది.

వాళ్లను చేయనివ్వరు..వీళ్లు చేయరు..
తమ గ్రామానికి మంచినీటి సరఫరా చేయాలని స్థానికులు అధికారులకు ఆర్జీలు పెట్టుకున్నా..వారి నుంచి స్పందన రావటం లేదు. పైగా ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్న దాతలకు ఎన్నికల కోడ్ పేరుతో అడ్డుపడుతున్నారు. ఈ పరిస్థితిపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అమ్మో ఆ ఊరా...అమ్మాయిని ఇవ్వం...
గ్రామాలలోని నీటి కష్టాలు అక్కడి యువకుల పాలిట శాపంగా మారుతోంది. 3 గ్రామాల్లోని 7 వేలకుపైగా ప్రజలకు ఒకే మంచి నీటి చేతి పంపు ఆధారం. ఇంకేముంది ఆ ఒక్క బోరు ముందు గంటల తరబడి క్యూ లైన్​లో నిల్చోవాలి. ఈ స్థాయి నీటి ఎద్దడి కారణంగా ఆ 3 గ్రామాల్లోని యువకులకు ఆడపిల్లలను ఇచ్చేందుకు తల్లిదండ్రులు ముందుకు రావటం లేదు.
భూగర్భజలాలు ఉప్పుగా మారడంతో పామర్రు నుంచి పైప్ లైన్ ద్వారా తాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వేసవి కల్లా పనులు పూర్తి చేయాలని సంకల్పించింది. అయితే ఎన్నికల పేరిట అధికారులు పనులను ఆపివేయటంతో ఈ కష్టాలు మరింత కాలం కొనసాగేలా కనిపిస్తున్నాయి.

Varanasi (UP), Apr 26 (ANI): While addressing Bharatiya Janata Party (BJP) worker in Uttar Pradesh's Varanasi, Prime Minister Narendra Modi said, "I have also been a booth worker, I got the privilege of putting posters on the walls. Today, through this forum, I express gratitude to all the citizens of the country and to all the party workers."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.