వారసత్వ సంపదను పరిరక్షించడంలో ప్రజలు ముఖ్యపాత్ర పోషించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. తమిళనాడులోని శ్రీరంగంలో ఉన్న అతి పురాతనమైన, అత్యంత విశాలమైన రంగనాథస్వామి ఆలయానికి మరమత్తులు చేశారు. ఆ ఆలయ వారసత్వ సంపదను పరిరక్షించిన విషయమై వెలువడిన పుస్తకాన్ని చెన్నైలో ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, రాష్ట్ర మంత్రులు, వైష్ణవ మఠాధిపతులు పాల్గొన్నారు.
2014లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదేశాల మేరకు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు టీవీఎస్ వేణు శ్రీనివాసన్ ఆలయ మరమ్మతు పనులను పర్యవేక్షించారు. 1530 సిబ్బందితో కేవలం 16 నెలల్లో గుడి మరమ్మతులు చేసిన శ్రీనివాసన్ బృందాన్ని ఉపరాష్ట్రపతి అభినందించారు. ప్రభుత్వమే అన్ని పనులు చేయాలని ఆశించకూడదనీ.. వారసత్వ సంపదను కాపాడుకోవడం ప్రజల బాధ్యతని వెంకయ్య నాయుడు అన్నారు.
ఇవీ చదవండి.. నాలుగు పదాలు చదవలేనివాడు.. ట్వీట్లు చేస్తున్నాడు"