కొత్త ప్రభుత్వం హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఒకదాని వెంట మరొకటి అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే... తెల్లరేషన్ కార్డుదారుల జీవితాలకు భరోసానిచ్చే బృహత్తర కార్యానికి సర్కారు శ్రీకారం చుట్టింది. వైద్య సేవలు పెంచేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది.
1.44 కోట్ల కుటుంబాలకు లబ్ది...
రాష్ట్రంలో కోటి 44 లక్షల కుటుంబాలకు తెల్లరేషన్ కార్డులున్నాయి. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఈ కుటుంబాలన్నీ లబ్దిపొందనున్నాయి. ప్రస్తుతం ఈ కుటుంబాలకు ఏడాదికి 5 లక్షల రూపాయల విలువైన వైద్యసేవలను ఉచితంగా అందిస్తున్నారు. రోగి పేరు ఆసుపత్రిలో నమోదైన తర్వాత పదిరోజుల వరకూ నగదు రహిత వైద్య సేవలు అనుబంధ ఆసుపత్రుల్లో అందుతున్నాయి.
రెండువేల రకాల సేవలు...
ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకం కింద 1059 రకాల సేవలు అందుతున్నాయి. వీటిని రెండువేలకు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటిలో 138 రకాల వైద్య సేవలు ఏడాదిపాటు పొందేందుకు అవకాశం ఉంది. రూ.5 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి సైతం ఈ సౌకర్యాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అధికారిక నిర్ణయం తీసుకుంటే మరో 5 లక్షల మంది ఈ పథకం పరిధిలోకి వస్తారని అధికారులు చెపుతున్నారు.
అందరూ బాగుంటేనే... రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే... సర్కారు ఆరోగ్య ఆంధ్రావైపు అడుగులేస్తోంది.
ఇదీ చదవండీ: పొట్ట కూటికోసం పోయి... పోలీసుల చెరలో చిక్కారు