మే రెండో వారంలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యే అవకాశాలున్నట్లు పాఠశాల విద్య రాష్ట్ర కమిషనర్ సంధ్యారాణి తెలిపారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో 70 శాతం మూల్యాంకనం పూర్తైనట్లు వెల్లడించారు. కడప పదోతరగతి మూల్యాంకన కేంద్రాలు పరిశీలించిన ఆమె.. మూల్యాంకనం జరుగుతున్న తీరు పర్యవేక్షించారు. అక్కడక్కడ ఉన్న లోటుపాట్లపై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 267 కరువు మండలాలలో బుధవారం నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని సూచించారు. 20 రోజుల్లో జిల్లాలకు పాఠ్యపుస్తకాలు చేరుతాయని వీలైనంత త్వరగా వాటిని పాఠశాలకు అందజేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి