మరో ఐదు రోజులు ఇలాగే..
భానుడి ఉగ్రరూపంతో రాష్ట్రం అగ్నిగుండంగా మారనుందని ఆర్టీజీఎస్ హెచ్చరించింది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 47 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వెల్లడించింది. నైరుతి రుతుపవనాల రాకలో జాప్యంతో వేడి మరింత పెరుగుతుందని స్పష్టమవుతోంది. ఈ రెండు రోజులు ఇళ్ల నుంచి బయటికు వచ్చేప్పుడు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మండే ఎండల నుంచి ప్రజలకు అధికారులు పలు సూచనలు చేస్తున్నారు.
- ఎండలోకి వచ్చేప్పుడు తెల్లరంగుతో ఉండే పలుచటి కాటన్ వస్త్రాలు ధరించాలి
- తలకు టోపీలు పెట్టుకోవాలి,ముఖానికి రుమాలు కట్టుకోవాలి
- ఎండలోంచి వచ్చాక చల్లిని నిమ్మరసం, కొబ్బరినీరు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది
- గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎండలోకి వెళ్లకుండా ఉండే మంచిది
- చల్లిని ప్రదేశాల్లో సేదా తీరాలి.
రానున్న నాలుగు రోజుల్లో కోస్తాలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.