ETV Bharat / state

ఈసీకి సీఎం లేఖ.. అందించిన తెదేపా బృందం - cm ramesh

పోలీసు ఉన్నతాధికారుల బదిలీల వి‍షయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు ఈసీకి రాసిన ఏడు పేజీల లేఖను తెదేపా ఎంపీలు ఈసీకి అందించారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం విడుదలను వాయిదా వేయాలని  కోరారు.

సీఎం ఏడు పేజీల లేఖను ఈసీకి అందించిన తెదేపా బృందం
author img

By

Published : Mar 27, 2019, 7:33 PM IST

సీఎం ఏడు పేజీల లేఖను ఈసీకి అందించిన తెదేపా బృందం
పోలీసు ఉన్నతాధికారుల బదిలీల వి‍షయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు ఈసీకి రాసిన ఏడు పేజీల లేఖను తెదేపా ఎంపీలు ఈసీకి అందించారు.

ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేసిన చరిత్ర దేశంలో ఇప్పటివరకు లేదని సీఎం రమేశ్ అన్నారు. అధికారులను బదిలీ చేస్తారని విజయసాయిరెడ్డి ముందే చెప్పడం... హత్య కేసు విచారణ చేస్తున్న ఎస్పీని బదిలీ చేయడంపలు అనుమానాలకు తావిస్తోందని జూపూడి అన్నారు. సీఎంకు రక్షణ ఇస్తున్న అధికారిని బదిలీ చేయడం సరికాదని రేపు సీఎంకు ఏమైనా అయితే ఈసీ బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నించారు.

ఎన్నికల సంఘం పారదర్శకంగా ఉండాలని కోరామని ఎంపీ కనకమేడల తెలిపారు. ఎన్నికల పరిధిలోకి ఎవరు వస్తారనే దానిపై రాష్ట్రం గతంలోనే జాబితా ఇచ్చిందని కనకమేడల తెలిపారు. ఫారం-7పై మేం ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు.

ఎన్నికలు పూర్తయ్యేవరకు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం విడుదలను వాయిదా వేయాలని ఈసీని నేతలు కోరారు.

ఇవీ చూడండి.

ఈసీ పరిధిలోకి పోలీసు యంత్రాంగం...

Intro:మూడు నెలల క్రితమే వారిద్దరికీ పెళ్లయింది. కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. అత్తారింటికి వచ్చిన వరుడు భార్యతో కలిసి తాను పనిచేసే చోటుకు పయనం అవుతున్న సమయంలో విధి కాటేసింది . కదులుతున్న రైలు ఎక్కుతున్న సమయంలో జారిపడి రైలు చక్రాల కింద కాళ్లు నలిగిపోయాయి . కళ్లెదుటే ఘోరాన్ని చూసి నా భార్యహతాశురాలైంది. అందిన సమాచారంతో కుటుంబ సభ్యులు స్టేషన్కు చేరుకుని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తీసుకు వెళుతున్న సమయంలోనే మృత్యువు కబలించింది.

Body:శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నౌపడ రైల్వే జంక్షన్ లో మంగళవారం జరిగిన ప్రమాదంలో చిత్తూరు కు చెందిన ప్రైవేటు ఉద్యోగి కావాడ భరత్(29) మృతిచెందాడు. భార్య లావణ్య తో కలసి సికింద్రాబాద్ వెళ్లేందుకు విశాఖ ఎక్ప్రెస్ రైలు ఎక్కుతున్న సమయంలో అదుపుతప్పి రైలు చక్రాల కింద పడిపోవడంతో రెండు కాళ్లు తెగి తీవ్రంగా గాయపడ్డాడు. తొలుత టెక్కలి లోని జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన సమయంలో ప్రమాదం జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. గతేడాది డిసెంబర్ 27న టెక్కలికి చెందిన లావణ్య తో వివాహ మైంది.

Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.