రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈనెల 10వతేదీ వరకు భారీ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో వడగాల్పుల ప్రమాదం ఉన్నట్లు ఇవాళ ఆర్టీజీఎస్ వెల్లడించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్న జిల్లాలు
45-46 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లాలు | కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు. |
43-45 డిగ్రీల ఉష్ణొగ్రతలు నమోదయ్యే జిల్లాలు | కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు. |
41-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లాలు | విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు. |
* ఈ రోజు ఉదయం 11 గంటలకు 170 మండలాల్లో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
* 9 మండలాల్లో 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది.
* 19 మండలాల్లో 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది.