విత్తనాల కొరతపై ప్రభుత్వం కనీసం స్పందించటం లేదని ఎమ్మెల్సీ పోతుల సునీత విమర్శించారు. మంగళవారం సునీత శాసనమండలిలో మాట్లాడారు. ప్రకాశం జిల్లా, రాయలసీమ జిల్లాల్లో నీటి సమస్య ఉందని దీని పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిసారించాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్టపరిహారం అందించే విషయంలోనూ ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని సునీత విమర్శించారు. ఈ 40 రోజుల్లో 37 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎమ్మెల్సీ తిప్పేస్వామి తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. రూ.7 లక్షల పరిహారం ప్రకటనలకే పరిమితమయిందని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండీ... 'వైఎస్ ఆత్మ వచ్చి..మాట్లాడండని చెప్పిందేమో'