ఈవీఎంల మొరాయింపు కారణంగా మొదటి రెండు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. ఉదయం 9 గంటల వరకు చాలా జిల్లాల్లో తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం... ఓటింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా | పోలింగ్ శాతం |
కృష్ణా | 5 |
నెల్లూరు | 4.9 |
విజయనగరం | 4.8 |
విశాఖపట్నం | 6 |
ప్రకాశం | 5.2 |
చిత్తూరు | 4.5 |
పశ్చిమ గోదావరి | 9 |
పోలింగ్ నిర్వహణ తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ప్రారంభమై 4 గంటలైనా ఇప్పటి వరకూ చాలా చోట్ల పోలింగ్ ప్రారంభం కాకపోవడంపై అసంతృప్తిగా వెనక్కి వెళ్లిపోతున్నారు. కొన్ని చోట్ల ఒక గుర్తుకు ఓటు వేస్తే మరో గుర్తుకు ఓట్లు పడుతున్నాయని ఆరోపించారు.