కురుపాం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పాముల పుష్ప శ్రీవాణి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం... శ్రీవాణి గిరిజన మహిళ కాదని పిటిషన్లో పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు సమయంలో తాము అభ్యంతరం తెలిపినా ఎన్నికల సంఘం అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. గతంలో పుష్పశ్రీ వాణి సోదరి స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికయ్యారని... అప్పుడు కొండదొర ఎస్టీ పేరుతో కుల ధ్రువీకరణ పత్రం చూపగా... గిరిజన అథారిటీ తిరస్కరించిన విషయం గుర్తుచేశారు.
ఈ అంశాలు సమాచార హక్కు చట్టంలో భాగంగా వెలుగు చూశాయని పిటీషనర్ పేర్కొన్నారు. ఎస్టీ కాని పుష్పశ్రీ వాణి కురుపాం నుంచి పోటీ చేశారని... ఆమె ఎన్నికను రద్దు చేయాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు. టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కింజారపు అచ్చెన్నాయుడు ఎన్నికనూ రద్దు చేయాలని కోరుతూ... హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అచ్చెన్నాయుడు నామినేషన్లో తనపై ఉన్న ఒకే కేసును మాత్రమే చెప్పారని... మరో కేసు వివరాలను తెలపలేదని వైకాపా నేత హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
ఇదీ చదవండీ...