ETV Bharat / state

11న మొదలయ్యే సభ ముందుకు.. 11 సవరణ బిల్లులు

ఈ నెల 11 నుంచి బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం సిద్ధమైంది. 11 కీలక చట్టాలకు సవరణలు చేసేందుకు సమాయాత్తమైంది.

బడ్జెట్​ సమావేశాల్లో కీలక అంశాలపై చట్ట సవరణకు బిల్లులు!
author img

By

Published : Jul 8, 2019, 5:18 PM IST

శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లులను చట్టంగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కీలక అంశాలకు చట్ట సవరణలు చేసే దిశగా... సభ ముందుకు ప్రతిపాదనలు తీసుకురానుంది. ఈ నెల 11వ తేదీన సమావేశాలు ప్రారంభమైన అనంతరం.. 12 న రాష్ట్ర బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి బుగ్గన ప్రవేశపెట్టనున్నారు. అనంతరం సుమారు 11 సవరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.

  • రాష్ట్రంలో తెలంగాణా తరహాలో లోకాయుక్త నియామకానికి సంబంధించి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించేలా చట్ట సవరణ చేపట్టనున్నారు.
  • విద్యుత్ నియంత్రణ మండలి సిఫార్సుల అమలుకు సంబంధించిన అంశంలోనూ చట్ట సవరణకు ప్రభుత్వం భావిస్తోంది.
  • జ్యుడీషియల్ కమిషన్ నియామకానికి ఏపీ ఇన్​ఫ్రా డెవలప్​మెంట్ ఎనేబిలింగ్ యాక్టు 2001కి చట్ట సవరణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మౌలిక సదుపాయాల కల్పన, ఇంజినీరింగ్ ప్రాజెక్టుల్లో సమీక్షకు జ్యుడీషియల్ కమిషన్​ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ కమిషన్ ఏర్పాటు కోసం చట్ట సవరణ అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది.
  • పాఠశాలలు, కళాశాలల్లో ఫీజు నియంత్రణకు సంబంధించి కమిషన్లను ఏర్పాటు చేసేందుకు నూతన బిల్లులను శాసనసభ ముందుంచనుంది.
  • రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖల్లో సంస్కరణలు తీసుకురావాలని యోచిస్తున్న ప్రభుత్వం జిల్లా ఆసుపత్రులకు స్వయం ప్రతిపత్తి కల్పించేలా సొసైటీలు, ట్రస్టుల కిందకు తీసుకువచ్చేందుకు అవసరమైన చట్ట సవరణ చేయడంపై కసరత్తు చేస్తున్నారు.
  • తిరుమల తిరుపతి దేవస్థాన ఛైర్మన్, పాలక మండలి సభ్యులను ఎప్పుడైనా రీకాల్ చేసేందుకు అవకాశం కల్పించేలా హిందూ ధార్మిక చట్టానికి సవరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపైనా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టనుంది.
  • రెవిన్యూతో పాటు కార్మిక శాఖకు సంబంధించిన రెండు అంశాలతో పాటు.. మరో 2 చట్ట సవరణ బిల్లులకూ కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి:

కడప స్టీల్‌ ప్లాంట్‌కు డిసెంబరు 26న శంకుస్థాపన : సీఎం జగన్

Intro:ap_knl_15_08_book_release_ab_ap10056
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని కర్నూల్ ఎమ్మెల్యే ఆఫీస్ అన్నారు కర్నూలు నగరంలోని కెసిఆర్ కళాశాల అధ్యాపకుడు ఇమ్మానియేల్ రచించిన రాజశేఖర జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆయన కె.వి.ఆర్ కళాశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత ఇమ్మానియేల్ మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి లో నేను ఎంతో సేవ అ లక్షణాలను గుర్తించామని తెలిపారు.
బైట్. హాఫిజ్ ఖాన్. mla కర్నూల్.

Body:ap_knl_15_08_book_release_ab_ap10056

Conclusion:ap_knl_15_08_book_release_ab_ap10056

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.