ETV Bharat / state

ఎన్నికల బరిలో ఎమ్మెల్సీలు..! - కిడారి

ఎన్నికల సమీపిస్తున్నకొద్దీ ఆంధ్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా చేసి బరిలోకి దిగాలనే సూత్రాన్ని అనుసరిస్తున్న అధికార పార్టీ...ఈ వ్యూహాలతో  ప్రజల్లోకి బలంగా దూసుకెళ్లొచ్చని భావిస్తోంది.

ఎన్నికల బరిలో ఎమ్మెల్సీలు..!
author img

By

Published : Feb 18, 2019, 6:27 AM IST

ఎన్నికల సమీపిస్తున్నకొద్దీ ఆంధ్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. శాసనమండలి సభ్యులు సైతం సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహాం చూపిస్తున్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ఎమ్మెల్సీలు శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసేవిధంగా తెదేపా ప్రణాళికలు రచిస్తోంది.

mlc's will contest on assembly elections -2019
సీఎం చంద్రబాబు

undefined
2014 ఎన్నికల్లో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కీలక నాయకులను శాసనమండలిలోకి తీసుకుని మంత్రి పదవులిచ్చింది...తెదేపా ప్రభుత్వం. ఈ సారి చంద్రబాబు తన ఆలోచనను మార్చి ..పదవులతో ప్రజలకు దగ్గరైన వారంతా ప్రజాక్షేత్రంలో పోటీపడాల్సిందేనని భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రత్యక్షఎన్నికల్లో పోటీకి సై అనడానికి నాయకులు వెనుకాడటం లేదని వినికిడి.
గేరు మార్చిన లోకేశ్..
గత ఎన్నికల సమయంలో పార్టీ కార్యకలాపాలకే పరిమితమైన లోకేశ్..ఎమ్మెల్సీగానే మంత్రి పదవి దక్కించుకున్నాడు. ఐటీ, పంచాయతీ రాజ్ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తూ..ప్రజల్లో తనదైన ముద్ర వేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి..ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే లోకేశ్ సీటుపై స్పష్టత వచ్చే అవకాశముంది.
కొత్త ముఖం కిడారి..ప్రత్యక్షంగానే
అనూహ్య పరిణామాలతో మంత్రి అయిన కిడారి శ్రావణ్..అరకు స్థానంలో బరిలోకి దిగనున్నారు. బోధన రంగం నుంచి రాజకీయాల్లో తనశైలిని ప్రదర్శిస్తోన్న మంత్రి పి.నారాయణ నెల్లూరు (నగరం) నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మరో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సర్వేపల్లి సీటు ఖరారైంది.
యనమల సోదరులూ...
సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ పదవీకాలం మార్చితో ముగుస్తుంది. పోయినసారి ఎన్నికల్లో ఆయన సోదరుడు యనమల కృష్ణుడు తుని స్థానంలో పోటీచేసి...వైకాపా అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో ప‌రాజ‌యం పాల‌య్యారు. ఈ సారి ఎలాగైనా తుని నియోజకవర్గాన్ని దక్కించుకోవాలని తెదేపా అధిష్ఠానం భావిస్తోన్న తరుణంలో... యనమల సోదరుల్లో టికెట్ ఎవరికి దక్కుతుందనేది అప్పుడే చెప్పలేం.
మిగిలిన వారిది అదేబాట
  • రెండు నెలల క్రితమే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించిన మంత్రి ఎన్.ఎండీ. ఫరూక్. కర్నూలు జిల్లాలో రాజీకీయ పరిస్థితుల నేపథ్యంలో...ఆయనపై అధినేత వైఖరి ఎలా ఉండబోతున్నదనే విషయం ఆసక్తిగా మారింది.
  • ఇప్పటికే కడప జిల్లా జమ్మలమడుగు అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి ఖరారైన విషయం తెలిసిందే.
  • మండలి చీఫ్ విప్ పయ్యావులకు అనంతపురం జిల్లా ఉరవకొండ టికెట్ మరోసారి ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తోందని సమాచారం.
  • 2014 లోక్సభ ఎన్నికల్లో ఓడిన మాగుంట శ్రీనివాస్ రెడ్డిని ..ఒంగోలు నుంచే లోక్సభకు పోటీ చేయించాలని పార్టీ యోచిస్తోంది.
  • వేడెక్కిన చీరాల రాజకీయాల్లో తెదేపా శాసనసభ అభ్యర్థిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రేసులో ఎమ్మెల్సీ పోతుల సునీత, కరణం బలరాం ఉన్నారు.
  • కిందటి ఎన్నికల్లో అరకు లోక్సభ స్థానంలో ఓటమి చవిచూసిన ఎమ్మెల్సీ సంధ్యారాణి..విజయనగరం జిల్లా సాలూరు ఎస్టీ రిజర్వడ్ సీటును ఆశిస్తున్నారు.

వైకాపాలోనూ..

  • వైకాపా తరపున శాసన మండలికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆళ్లనాని, కోలగట్ల వీరభద్రస్వామి వారి నియోజకవర్గాలైన ఏలూరు, విజయనగరాల్లో పోటీ చేస్తారని సమాచారం.

ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా చేసి బరిలోకి దిగాలనే సూత్రాన్ని అనుసరిస్తున్న అధికార పార్టీ...ఈ వ్యూహాలతో ప్రజల్లోకి బలంగా దూసుకెళ్లొచ్చని భావిస్తోంది.

Rabat (Morocco), Feb 17 (ANI): Union External Affairs Minister Sushma Swaraj arrived in Morocco's Rabat on Sunday. This is her first ever visit to the country. EAM Swaraj will meet her Moroccan counterpart from Maroc Diplomatie Nasser Bourita and political leadership during her visit.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.