జగన్-మోదీ జోడీ రాష్ట్రంలో కులం పేరిట కలహాలు సృష్టించాలని చూస్తున్నారని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. అభివృద్ధి, సంక్షేమాలు జెండా, అజెండాగా చేసుకోని నిరంతరం రాష్ట్రం కోసం సీఎం నిరంతరం పాటుపడుతుంటే ఏదో కారణంతో గొడవలు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. గుంటూరు రైతు హత్యను రాజకీయం చేయాలని ప్రయత్నించినా ప్రభుత్వం సమర్థంగా తిప్పికొట్టిందని వ్యాఖ్యానించారు. జగన్-మోదీలకు కులం, మతాలే అజెండాలని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమాలలో సీఎం చంద్రబాబుతో పోటీ పడలేక కులం పేరిట రాష్ట్రంలో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. కులం పేరిట ఎన్ని కుయుక్తులు పన్నినా తట్టుకుని నిలబడే శక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకూ కేంద్రాన్ని నిలదీస్తునే ఉంటామని లోకేశ్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కులం పేరుతో కుట్రలు మొదలుపెట్టారు. తరువాత మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. జగన్ మోడీ రెడ్డి ద్వయం ఎన్ని కుయుక్తులు పన్నినా, ఆంధ్రప్రదేశ్ కి హోదా ఇచ్చేవరకూ కేంద్రాన్ని, ప్రధాని మోడీగారిని నిలదీయడంలో వెనక్కి తగ్గేది లేదు.
— Lokesh Nara (@naralokesh) February 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">ప్రస్తుతం రాష్ట్రంలో కులం పేరుతో కుట్రలు మొదలుపెట్టారు. తరువాత మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. జగన్ మోడీ రెడ్డి ద్వయం ఎన్ని కుయుక్తులు పన్నినా, ఆంధ్రప్రదేశ్ కి హోదా ఇచ్చేవరకూ కేంద్రాన్ని, ప్రధాని మోడీగారిని నిలదీయడంలో వెనక్కి తగ్గేది లేదు.
— Lokesh Nara (@naralokesh) February 22, 2019ప్రస్తుతం రాష్ట్రంలో కులం పేరుతో కుట్రలు మొదలుపెట్టారు. తరువాత మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. జగన్ మోడీ రెడ్డి ద్వయం ఎన్ని కుయుక్తులు పన్నినా, ఆంధ్రప్రదేశ్ కి హోదా ఇచ్చేవరకూ కేంద్రాన్ని, ప్రధాని మోడీగారిని నిలదీయడంలో వెనక్కి తగ్గేది లేదు.
— Lokesh Nara (@naralokesh) February 22, 2019