ETV Bharat / state

ఆరుగురి ప్రాణాల్ని బలితీసుకున్న పిడుగులు - rains in ap

రాష్ట్రంలో శనివారం ఈదురు గాలులతో కురిసిన వర్షాలు... ఆరుగురి ప్రాణాల్ని బలితీసుకున్నాయి. ముందే అప్రమత్తమైన అధికారులు... కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు పిడుగు హెచ్చరికలు జారీ చేశారు. చిత్తూరు జిల్లాలో చంద్రగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయినా ప్రాణనష్టం జరిగింది.

ఆరుగురి ప్రాణాల్ని బలితీసుకున్న పిడుగులు
author img

By

Published : Apr 21, 2019, 6:23 AM IST

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరులో పిడుగుపాటుతో చిన్నయ్య అనే వ్యక్తి మృతిచెందారు. విశాఖ జిల్లా పెందుర్తిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కృష్ణరాయపురం ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద పిడుగుపాటుకు సోంపురం గ్రామానికి చెందిన ఈశ్వరరావు మృతిచెందారు.

గుంటూరు జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతిచెందారు. ఈపూరు మండలం అగ్నిగుండాలలో చినవెంకటేశ్వర్‌రెడ్డి, వినుకొండ మండలం ఉప్పరపాలెంలో చిర్రయ్య(55), కారంపూడిలో షేక్ మస్తాన్‌బీ(48) మృతిచెందారు. పొలంలో పనులు చేస్తుండగా పిడుగుపడి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ప్రకాశం జిల్లాలో దర్శి సాయినగర్‌లో పిడుగుపడి శ్రీరామ్‌శివ అనే యువకుడు మృతి చెందారు.

This is test file from feedroom
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.