ETV Bharat / state

'ఈ నెల 18 వరకూ భానుడి భగభగలు'

జూన్ లోను భానుడు కరుణ చూపటం లేదు... వరుణుడు కనికరించటం లేదు. వడగాల్పులు, అధిక వేడితో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిన్న కొన్ని ప్రాంతాల్లో 46డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

author img

By

Published : Jun 16, 2019, 1:42 PM IST

'ఈ నెల 18 వరకూ భానుడి భగభగలు'

జూన్‌ నెల లోను భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వాతావరణలో తేమ శాతం గణనీయంగా పడిపోవటం వల్ల వడగాల్పుల తీవ్రత అధికంగా ఉందని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. ఈ నెల18 వ‌ర‌కూ అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశమున్నట్లు తెలిపారు.
అప్రమత్తంగా ఉండండి...
ఎండ, వడగాల్పులతో ప్రజ‌లు అప్రమ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండ‌ల్లో తిర‌గకుండా నీడ‌ప‌ట్టున సేదతీరాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల విష‌యంలో త‌గిన ముంద‌స్తు జాగ్రత్తలు పాటించాల‌ని పేర్కొన్నారు.
నిన్నటి ఉష్ణోగ్రతలు...
నిన్న అత్యధికంగా 46.20 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌నిమెర‌, విశాఖ‌ జిల్లా వేచ‌లంలో..రాష్ట్రంలోనే అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత న‌మోదైంది. ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల‌తో పాటు గుంటూరు జిల్లాలోనూ 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత‌లు న‌మోద‌య్యాయి. అన్ని జిల్లాల్లోనూ 41 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు...RTGS తెలిపింది.
19న రాష్ట్రానికి రుతుపవనాలు...
ఈనెల 19న రాష్ట్రానికి రుతుపవనాలు తాకుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. రాష్ట్రంలోని అనంత‌పురం, చిత్తూరు జిల్లాల‌ను రుతుప‌వ‌నాలు పలకరించనున్నట్లు తెలిపారు. వీటి ప్రభావంతో 19 నుంచి 24 వ తేదీ లోపు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇవీ చూడండి-'సెలవులు ఇవ్వండి మహాప్రభో....'

New Delhi, Jun 12 (ANI): Two days after registering one of the hottest days of June with the temperature touching 48 degrees Celsius, heavy dust storm hit the national capital, bringing a respite to the Delhites who were suffering from intense heat wave for the last couple of weeks. Skymet Weather, a private forecast agency, predicted intense rains in the days to come, and said some parts could witness heavy showers as well. On 10 June, Delhi recorded its one of the hottest temperature of June in recent years as the mercury touched 48 degrees Celsius.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.