రాష్ట్రంలో ఉష్ణతాపం తారాస్థాయికి చేరింది. వాయవ్య భారత్ నుంచి మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణాల మీదుగా వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావంతో కోస్తాంధ్ర సెగలు కక్కుతోంది. ప్రత్యేకించి ఉభయగోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. రాగల రెండు, మూడు రోజుల్లోనూ 45 నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఈ ప్రాంతాల్లో రికార్డు అవుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ చాలా చోట్ల 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఉత్తర కోస్తాలోని కొన్ని చోట్ల మాత్రం సగటు ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
రాగల రెండు, మూడు రోజుల్లో భానుడి ఉగ్రరూపం - ఎండాకాలం
రాగల రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో భానుడి భగభగలు ఎక్కువ కానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి... తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.