కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని గరికపాడు బోర్డర్ రెస్టారెంట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎక్సైజ్ అధికారులు ఉమ్మడి సమావేశం నిర్వహించారు. సరిహద్దులో గల 6 జిల్లాల ఉన్నతాధికారులు, 13 ఎక్సైజ్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అక్రమ మద్యం, నాటుసారా, చట్ట వ్యతిరేక కార్యకలపాలను అరికట్టేందుకు ఉమ్మడి కార్యాచరణ రూపొందించారు. సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతూ అక్రమాలకు అడ్డుకట్టవేయాలని సమావేశంలో నిర్ణయించారు.
ఇదీ చదవండి