ప్రజలను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు.. ఆర్టీసీ రోజుకు సగటున 12 వేల బస్సులను... 43 లక్షల కిలోమీటర్ల మేర.. వివిధ మార్గాల్లో నడుపుతోంది. నెలకు రెండున్నర కోట్ల లీటర్ల చొప్పున... ఏడాదికి 30 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగిస్తోంది. ఈ మేరకు.. డీజిల్ ధర రూపాయి పెరిగితే.... ఆర్టీసీపై ఏడాదికి 30 కోట్ల భారం పడుతుంది. తాజాగా... కేంద్రం నిర్ణయంతో డీజిల్ ధర 2 రూపాయల 47 పైసలు పెరిగింది. అలాగే.. ఆర్టీసీపై ఏడాదికి దాదాపు 73 కోట్ల అదనపు భారం పడింది. ఇప్పటికే 6 వేల కోట్ల రూపాయల అప్పులతో సతమతమవుతున్న ఆర్టీసీ... తాజా పరిణామంతో మరింత ఆర్థిక ఇబ్బందుల్లో పడేలా కనిపిస్తోంది.
ఖర్చు రూ.44.58.. ఆదాయం రూ.38
ఆర్టీసీ బస్సు కిలోమీటరు నడపడానికి 44 రూపాయల 58 పైసలు ఖర్చవుతుంటే... ఆదాయం మాత్రం 38 రూపాయలే వస్తోంది. లాభాల మాట పక్కన పెడితే... పెరుగుతోన్న నష్టాలు ఎలా తగ్గించుకోవాలో అధికారులకు అర్థం కావడం లేదు. టిక్కెట్ ధరలు పెంచాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆర్టీసీని విలీనం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్న ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఛార్జీలు పెంచే ఆలోచనలో లేదు.
నిర్వహణ ఎలా?
ప్రభుత్వంలో విలీనమయ్యే వరకైనా ఆర్టీసీ నిర్వహణ ఎలా అనే అంశంపై... అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. రోజువారీ నిర్వహణ సహా కార్మికులకు సంబంధించి బకాయిల చెల్లింపునకు వీలుగా ప్రభుత్వం నుంచి తక్షణ సాయం కోరాలని నిర్ణయించారు. బడ్జెట్‌లో తాత్కాలిక సాయం కింద నిధులు కేటాయించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
ఇదీ చదవండి