రాష్ట్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నడక తిప్పలు తప్పట్లేదు. గత ప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్ ద్వారా ఆయా స్కూళ్లకు సైకిళ్లను పంపిణీ చేసేది. నూతన ప్రభుత్వం రావటం...విద్యా శాఖ కమీషనర్ నుంచి ఆదేశాలు రాకపోవటంతో...సైకిళ్లను విద్యార్థులకు ఇవ్వకుండా పాఠశాలల్లోనే ఉంచారు. ఈ కారణంగా నాలుగైదు కిలోమీటర్ల నుంచి వచ్చే విద్యార్థులు కాలినడకన రావాల్సి వస్తోంది. దీనివల్ల సకాలంలో స్కూలుకు చేరుకోలేకపోతున్నామని... త్వరగా వచ్చేందుకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి-'3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు'