ETV Bharat / state

రేపు గవర్నర్​కు రాజపత్రం అందజేయనున్న ద్వివేది - governor

రేపు గవర్నర్ నరసింహన్​తో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భేటీకానున్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల వివరాలతో కూడిన రాజపత్రాన్ని రేపు గవర్నర్​కు ద్వివేది అందించనున్నారు.

ద్వివేది(ఫైల్ ఫొటో)
author img

By

Published : May 25, 2019, 5:34 AM IST

రాష్ట్రంలో శాసన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధుల వివరాలతో రాజపత్రాన్ని ప్రచురించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 73 ప్రకారం ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను ఎన్నికల సంఘం రాజపత్రంగా ప్రచురించనుంది. గెలుపొందిన శాసనసభ్యుల జాబితాను గవర్నర్‌కు సమర్పించాలని ఈసీ భావిస్తోంది. రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది నేతృత్వంలో ఆదనపు సీఈవోలు వివేక్ యాదవ్, సుజాత శర్మ గవర్నర్‌కు సమర్పించనున్నారు. గవర్నర్ ఆమోదించిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వైకాపాను ఆహ్వానించనున్నారు. అధికారిక లాంఛనాలు పూర్తయ్యాక వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే గెలుపొందిన ఎమ్మెల్యేలకు సంబంధిత ఆర్వోలు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

Intro:ap_knl_131_24_dongalu_muta_arrest_ab_c13

పేరు-నరసింహులు. సెంటర్-మంత్రాలయం

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో గత సంవత్సరం డిసెంబర్ 13, ఏప్రిల్ 29న జరిగిన దొంగథానాలలో పోలీసులు దొంగలను అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆదోని డీఎస్పీ వెంకటారాముడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు దొంగతనాలలో 11తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.32వేల నగదును అపహరించారు. పట్టణ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో ఎసై శ్రీనివాసులు వేలిముద్రలు ద్వారా నిందితులను కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా వాసులుగా గుర్తించి అరెస్ట్ చేశామన్నారు.

Body:నరసింహులు

Conclusion:మంత్రాలయం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.