ETV Bharat / state

చంద్రబాబు నివాసమూ.. అక్రమ కట్టడమే: బొత్స - chandra babu

కృష్ణానది కరకట్టపై అక్రమ కట్టడాలు, ప్రజావేదిక తొలగింపుపై శానసమండలిలో చర్చ జరిగింది. సభ్యుల ప్రశ్నలకు బొత్స సత్యనారాయణ సమాధానమిస్తూ చంద్రబాబు ఉంటున్న నివాసం అక్రమ కట్టడమేనని.. నోటీసులకు సమాధానం వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

శాసన మండలిలో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ
author img

By

Published : Jul 17, 2019, 12:43 PM IST

శాసన మండలిలో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ

కృష్ణానది కరకట్ట వెంట అక్రమ కట్టడాలు, ప్రజావేదిక తొలగింపుపై శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. ఈ అంశంపై వైకాపా సభ్యుడు జంగా కృష్ణమూర్తి వేసిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పారు. మొత్తం 26 కట్టడాలకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. కృష్ణానది వెంట 6 వేల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని... చాలా కట్టడాలు ఉన్నాయని... వీటన్నింటినీ కూలుస్తారా అని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ప్రశ్నించారు.

భాజపా ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ... చట్టాలు ఉల్లంఘించి కట్టడాలు చేయటం సరికాదని... ప్రజావేదిక కూల్చకుండా వేరేచోటికి తరలిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. గోకరాజు, మంతెన సత్యనారాయణ రాజు కట్టడాలు కూలుస్తారా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. వైఎస్ హయాంలోనే కరకట్ట వెంట కట్టడాలు వెలిశాయని యనమల అన్నారు. వీటన్నింటికీ సమాధానం చెప్పిన బొత్స.... అప్పుడు తప్పు జరిగితే వాటిని అలాగే ఉంచాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఉంటున్న భవనం కూడా అక్రమ కట్టడమేనని... నోటీసులకు సమాధానం వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చంద్రబాబు ఉండే నివాసానికి అనుమతులు ఉంటే కోర్టుకు ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. నీటిపారుదల శాఖ అనుమతి లేకున్నా ప్రజావేదిక నిర్మించారని తెలిపారు. చంద్రబాబు ఇళ్లు ఖాళీ చేస్తే ప్రజలకు మంచి సందేశం ఇచ్చినట్లవుతుందని బొత్స సూచించారు.

ఇదీ చదవండి

చంద్రబాబూ... నన్ను బెదిరించొద్దు: సభాపతి

Intro:సెంటర్:తణుకు, జిల్లా :పశ్చిమగోదావరి,
రిపోర్టర్: ఎం. వెంకటేశ్వరరావు
AP_TPG_11_16_GURUPOURNAMI_AV_AP10092
( ) గురు పౌర్ణమి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో వేంచేసి ఉన్న షిరిడీ సాయి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

Body:గురు పౌర్ణమి రోజు స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని భక్తులు నమ్ముతారు. ఆలయ ప్రాంగణంలో 101 మంది మహిళలు సామూహిక సత్యసాయి వ్రతాలు ఆచరించారు. సంప్రదాయబద్ధంగా వేద మంత్రోచ్చారణల మధ్య వ్రత క్రమాన్ని పూర్తి చేశారు.

Conclusion:దేవస్థాన పాలక వర్గం కార్యదర్శి వి వి ఎల్ నాగరాజు ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.