ETV Bharat / state

సమరాంధ్ర@2019...కమలనాథుల... ప్రచార వ్యూహం

సార్వత్రిక ఎన్నికల్లో తమ బలం చాటుకునేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఓ వైపు రాష్ట్రంలో అధికారంలోకి రామని చెబుతూనే మెజారిటీ స్థానాల్లో పాగా వేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

కమలనాథుల... ప్రచార వ్యూహం
author img

By

Published : Mar 26, 2019, 5:02 AM IST

Updated : Mar 26, 2019, 5:40 AM IST

కమలనాథుల... ప్రచార వ్యూహం
గెలుపు అవకాశాలు ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎన్నికల్లో లబ్ధి పొందే దిశగా భాజపా పావులు కదుపుతోంది. అందుకు తగ్గట్టే ప్రచార ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో ప్రచారం చేయించి... రాష్ట్ర ప్రజలను తమవైపు తిప్పుకోవాలని కమల దళం ప్రయత్నిస్తోంది.29న మోదీ రాక
పోలింగ్​కు సమయం తక్కువ ఉన్నందున భాజపా ప్రచార వేగం పెంచి... వ్యూహాలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారం చేసి... ప్రజల మనసు దోచుకోవాలని తహతహలాడుతోంది. ఏ అవకాశాన్నీ వదులుకోవద్దని పట్టుదలగా ఉంది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ... సహా పలువురు కేంద్ర మంత్రులను రంగంలోకి దించనుంది. ఈ నెల 29న రాజమహేంద్రవరంలో తలపెట్టిన విజయ సంకల్ప సభలో మోదీ పాల్గొననున్నారు. ఏప్రిల్ 1న కర్నూలు జిల్లాలో జరిగే సభకూ వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కేంద్ర మంత్రులూ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు.
ప్రజాకర్షక మేనిఫెస్టో
ఇప్పటికే మేనిఫెస్టో రూపొందించిన భాజపా... ఇవాళ కేంద్రమంత్రి పీయూష్​గోయల్ చేతుల మీదుగా విజయవాడలో విడుదల చేయనుంది. ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి చేసిన పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్రం ఇచ్చిన నిధులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందులో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ప్రజాకర్ష పథకాలు ప్రకటించనున్నట్టు సమాచారం. ప్రజావ్యతిరేకతను దూరం చేసుకునేలా ఎన్నికల ప్రచారం ఉంటుందని భాజపా నేతలు చెబుతున్నారు.

Howrah (West Bengal), Mar 25 (ANI): Makkal Needhi Maiam (MNM) chief Kamal Haasan met West Bengal Chief Minister and Trinamool Congress (TMC) chief Mamata Banerjee at Nabanna in Howrah today. Both leaders met each other ahead of the Lok Sabha elections. Kamal Haasan had said that he will not contest the Lok Sabha elections. Speaking to ANI, Kamal Haasan said, "Meeting was excellent we are proud to say that MNM is an ally of TMC in Andaman. We hope this relation evolves in future. I am going to campaign for their candidate in Andaman." The General Elections will be held in seven phases for 543 Lok Sabha seats on April 11, April 18, April 23, April 29, May 6, May 12 and May 19. The counting of votes will take place on May 23.
Last Updated : Mar 26, 2019, 5:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.