ETV Bharat / state

నవ్యాంధ్ర నిర్ణయం... కౌంట్​డౌన్ స్టార్ట్ - 2019 ap elections

ఓటరు మహాశయుల నిర్ణయం వెల్లడయ్యేందుకు ఇంకా కొన్ని గంటలే ఉంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు ఎలా ఉన్నా... అధికారిక ఫలితాల కోసమే అందరి నిరీక్షణ. పోలింగ్‌ పూర్తయ్యాక గతంలో ఎప్పుడూ ఫలితాలకు ఇన్ని రోజుల గడువు తీసుకోలేదు. ఓటర్ల తీర్పు కోసం ఈసారి 42 రోజులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 175 అసెంబ్లీ స్థానాల్లో 2,118 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 25 ఎంపీ స్థానాలకు 319 మంది పోటీపడ్డారు. 2014 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఈసారి మూడు ప్రధాన పార్టీలు ఒంటరిగానే అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఓటర్లు ఎవరికీ మద్దతిచ్చారో కొన్ని గంటల్లోనే తేలనుంది.

నవ్యాంధ్ర నిర్ణయం... కౌంట్​డౌన్ స్టార్ట్
author img

By

Published : May 22, 2019, 4:31 PM IST

Updated : May 22, 2019, 5:03 PM IST

నవ్యాంధ్ర నిర్ణయం... కౌంట్​డౌన్ స్టార్ట్

ఈ ఎన్నికల్లో 79.64 శాతం పోలింగ్‌ నమోదైంది. 2014 ఎన్నికలతో పోలిస్తే 2019లో 1.68 శాతం మేర అధికంగా పోలింగ్‌ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా పురుషుల కంటే 4లక్షల17వేల 82 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉండడంతో పోలైన ఓట్లలోనూ... పురుషుల కంటే 2లక్షల 35వేల 398 మంది మహిళల ఓట్లు అధికంగా ఉన్నాయి. పోలైన ఓట్లలో 50.37 శాతం ఓట్లు మహిళలవి కాగా...49.63 శాతం ఓట్లు పురుషులవి.

తెదేపా... అతడే అన్నీ...
ఈ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థుల ఎంపిక మొదలు... ప్రచారం వరకు అన్నీ బాధ్యతలు చంద్రబాబే మోశారు. సిట్టింగ్, ఆశావాహులు అందరి మధ్య సయోధ్య కుదర్చడం, కార్యకర్తలు, నేతల మధ్య సమన్వయం పెంచడం, నేతల మధ్య దూరాన్ని తగ్గించడంలో చంద్రబాబు సఫలమయ్యారు. అందుకే గెలుపుపై తెదేపా ధీమాగా ఉంది. కొన్నిచోట్ల ప్రతిపక్ష వైకాపా గట్టిపోటీ ఇస్తుందని అంచనా వేసి సిట్టింగ్​లకు మళ్లీ అవకాశం ఇవ్వలేదు. ప్రత్యర్థుల వ్యూహాల్ని ముందే పసిగట్టి... తగిన చర్యలు తీసుకున్నారు చంద్రబాబు.

జగన్ ఎక్కడా తగ్గలేదు...
వైకాపా ప్రధాన ప్రత్యర్థి తెదేపాతో పోల్చుకుంటే... జగన్ ఎక్కడా తగ్గకుండా తన వ్యూహాలకు పదునుపెడుతూ... ఎన్నికలను ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్లు ఎన్నికలు జరిగాయి. జగన్ కూడా అదే విధంగా ప్రసంగాలు చేసి ఆకట్టుకున్నారు. వైకాపా తరఫున జగన్ వన్​ మ్యాన్ షో చూపించారు. పార్టీకీ, అభ్యర్థులకు, కార్యకర్తలకు అన్నీ తానై నిలిచి ఎన్నికలను ఎదుర్కొన్నారు.

ఇతర పార్టీల పరిస్థితి ఏంటీ...
తెదేపా, వైకాపా మినహా ఈ ఎన్నికల్లో వేరే ఏ పార్టీలు అంత ప్రభావం చూపలేదు. జనసేన ఎంతోకొంత ప్రభావం చూపినా... అనుకున్న స్థాయిలో లేదు. ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఇదే విషయాన్ని చెప్పాయి. ఇక కాంగ్రెస్, భాజపా అసలు ఖాతా తెరిచే పరిస్థితి లేదు. పోటీ మొత్తం చంద్రబాబు, జగన్ మధ్యే జరిగింది.

ప్రభావం చూపిన అంశాలేవి...
ఈ ఎన్నికల్లో ఇరు ప్రధాన పార్టీల అధినేతలు చంద్రబాబు, జగన్ ఎక్కువ ప్రభావం చూపారు. వీరి ప్రసంగాలు, ఎదుటివారిపై సమయానుసారంగా వేసే పంచ్​లు రక్తి కట్టించాయి. తెదేపా 'మీ భవిష్యత్తు నా బాధ్యత'... వైకాపా 'నవ రత్నాలు' ప్రజల్ని ఆలోచింపజేశాయి. ప్రజలు చంద్రబాబు భరోసాను నమ్మారా...? నవ రత్నాలపై ఆశలు పెట్టుకున్నారా..? అనేది కొన్ని గంటల్లో తేలనుంది.

ఇదీ చదవండీ...

'ఉత్కంఠ' భారతం: కొద్ది గంటల్లో ప్రజాతీర్పు

Intro:AP_NLR_01_21_10TH_STUDENTS_GIFTS_RAJA_AVB_C3
anc
పదవ తరగతిలో 10 కి పది పాయింట్లు సాధించిన విద్యార్థులకు యాదవ ఎంప్లాయిస్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం లోని టౌన్ హాల్ లో ఉత్తమ ప్రతిభ పురస్కారాలు అందజేశారు. నెల్లూరు జిల్లాలో దాదాపు 400 మంది విద్యార్థులకు ఈ ప్రతిభా పురస్కారాలు అందజేశారు. పదిహేను వందల రూపాయలు విలువ చేసే బ్యాగు, పుస్తకాలు అందజేశారు .ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలని సూచించారు. 2008 సంవత్సరం నుంచి యాదవ ఎంప్లాయిస్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో ఉత్తమ పురస్కారాలు అందజేస్తామని వారు తెలిపారు.
బైట్, మాదాల వెంకటేశ్వరరావు , యాదవ ఎంప్లాయిస్ ప్రొఫిషనల్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నెల్లూరు జిల్లా

Body:తమ ప్రతిభా పురస్కారాలు

Conclusion:బి రాజా నెల్లూరు
Last Updated : May 22, 2019, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.