ETV Bharat / state

"జగన్ ప్రమాణ స్వీకారానికి పటిష్ఠ బందోబస్తు"

జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఐదురకాల పాసులు ఉన్నాయని, వారంతా ఉదయం 10.30లోపే స్టేడియానికి చేరుకోవాలని సీపీ సూచించారు.

author img

By

Published : May 29, 2019, 11:47 AM IST

Updated : May 29, 2019, 5:50 PM IST

జగన్‌ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు

జగన్ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా... విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ ద్వారక తిరుమలరావు తెలిపారు. స్టేడియం లోపల భద్రత, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్‌కు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వివరించారు. స్టేడియం మొత్తం సామర్థ్యం 30 వేలమందికి ఉందన్న సీపీ... గ్రౌండ్‌లో 12 వేలు, గ్యాలరీలో 18 వేలమంది కూర్చునే వీలుందని వివరించారు. ప్రమాణ స్వీకారానికి 12 వేల పాసులు జారీ చేస్తున్నామని చెప్పారు.

సాధారణ ప్రజలను గ్యాలరీలోకి అనుమతిస్తామని సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. స్టేడియం పక్కన ఉండే ప్రజలు వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విజయవాడ మీదుగా వెళ్లే భారీ వాహనాలను శివారు మీదుగా మళ్లిస్తామన్న సీపీ... బుధవారం అర్ధరాత్రి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయని స్పష్టం చేశారు. నగరంలో స్టేడియం మీదుగా వెళ్లే వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లిస్తున్నట్లు చెప్పారు.

ఐదు రకాల పాస్‌లు ఉన్నాయన్న సీపీ ద్వారకా తిరుమలరావు... పాసులు ఉన్నవారంతా ఉదయం 10.30 గంటలలోపు స్టేడియానికి చేరుకోవాలని సూచించారు. వాహనాలు నిలిపి ఉంచేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్న సీపీ... పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో కార్లు నిలిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. వేదిక సమీపం వరకూ వాహనాలు వచ్చేలా ఏర్పాట్లు చేశామన్న సీపీ ద్వారకా తిరుమలరావు... హైదరాబాద్‌, విశాఖ నుంచి వచ్చే వాహనాలు హనుమాన్‌ జంక్షన్‌ వద్ద దారిమళ్లించనున్నట్లు తెలిపారు.

జగన్‌ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు

ఇదీ చదవండీ...

కీలకమైన పదవుల్లో సమర్థులైన అధికారులు..!?

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు.
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46,56a_29_Grand_Welcome_MLA,MP_AV_C8

Body:2019 సాధారణ ఎన్నికల్లో ఘన విజయం సాధించి తొలిసారిగా అనంతపురం జిల్లా కదిరి కి వచ్చిన ఎమ్మెల్యే ఎంపీ లకు వైకాపా శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. నియోజకవర్గ సరిహద్దు అయిన పట్నం గ్రామానికి చేరుకున్న వైకాపా నాయకులు కార్యకర్తలు గజమాలతో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అపూర్వ స్వాగతం పలికారు. కదిరి పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగన్ సారథ్యంలో రామన్న రాజ్యం తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ,ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు

Conclusion:
Last Updated : May 29, 2019, 5:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.