చంద్రబాబు అవాస్తవాలు మాట్లాడుతున్నారు : వైఎస్ జగన్ - YS JAGAN ON TIRUMALA LADDU
🎬 Watch Now: Feature Video
YS JAGAN ON TIRUMALA LADDU: కూటమి పాలనా వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకే చంద్రబాబు తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తిచూపిందని, సిట్‌ను సైతం రద్దు చేసి మొట్టికాయలు వేసిందన్నారు. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా చంద్రబాబు పశ్చాత్తాపం పడటం లేదన్న జగన్.. దిగజారి పోయి మరీ టీడీపీ ట్విట్టర్ వేదికగా తప్పుడు సమాచారం పోస్టు చేశారన్నారు.
ప్రజలకు, భక్తులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సింది పోయి, టీడీపీ ఎక్స్ ఖాతాలో అవాస్తవాలు చెబుతూ ట్వీట్ పెట్టడం దారుణమన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగకపోయినా, జరిగినట్లు చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను కావాలనే రాజకీయ దుర్బిద్దితో ఎలా రెచ్చగొడుతున్నారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందన్నారు. దేవున్ని రాజకీయాల్లోకి లాగవద్దని సుప్రీంకోర్టు సైతం ఆదేశించిందన్నారు. కల్తీ జరిగిందని చెబుతోన్న ట్యాంకర్లలో నెయ్యిని వాడలేదని, వాటిని వెనక్కి పంపినట్లు టీటీడీ ఈవో స్పష్టంగా మీడియా సమావేశం పెట్టి తెలిపారన్నారు.