పాలన కోసం తనదైన బృందాన్ని తయారు చేసుకుంటున్న కాబోయే ముఖ్యమంత్రి జగన్ .. పాలనా పరమైన సంస్కరణల్ని కూడా తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులందరికీ ఈ విషయంపై స్పష్టతనిచ్చినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల మనోభావాలను తెలుసుకుని అందుకు అనుగుణంగానే చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.
పాలనా సంస్కరణలకు ప్రత్యేక కార్యచరణ తగ్గనున్న పని వేళలు నూతన ప్రభుత్వంలో ఉద్యోగులకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే పనివేళలలుగా నిర్ణయించారని తెలుస్తోంది. అయితే ఆ సమయంలో పూర్తి స్థాయిలో విధినిర్వహణకే సమయం వెచ్చించేలా కార్యాచరణ చేపట్టాలని ఉన్నతాధికారులకు జగన్ సూచించారు. ఉద్యోగులపై ఏమాత్రం అదనపు పనిభారం పడకుండా చూడాలని అదేశించినట్టు సమాచారం.సాయంత్రం ఆరు గంటల తర్వాత ఉద్యోగులపై ఏమాత్రం విధులకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చూడాలని ఉన్నాతాధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
అనవసర జాప్యాలకు చెక్ఇక ప్రతీ ఫైల్‌నూ... నిర్ధిష్టమైన గడువులోగా క్లియర్ చేసేలా పాలనా సంస్కరణలు తీసుకురావాలని శాఖలవారీ సమీక్షల్లో చెప్పనున్నట్టు తెలుస్తోంది. ఫైళ్లలో అనవసరపు కొర్రీలు, జాప్యాలు లేకుండా చర్యలు చేపట్టాల్సిందిగా సీఎస్‌ను ఆదేశించినట్టు సమాచారం. ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యల్లో కూడా సంస్కరణలు తీసుకురావాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. పదవీ విరమణ చేసే ఉద్యోగుల ప్రయోజనాలు హరించే నిర్ణయాలకు చెక్ పెట్టేలా చర్యలు చేపట్టనున్నట్టు సమాచారం. పెన్షన్ నిబంధనల్లోనూ సంస్కరణలు తీసుకు వచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాల్లో ఉద్యోగుల నుంచి సూచనలు సలహాలు తీసుకోవాలని కూడా భావిస్తున్నారు. ఈమేరకు సీఎస్ కార్యాలయం కూడా ఏర్పాట్లు చేస్తోంది.
ఇదీచదవండి
ఆధ్యాత్మిక పర్యటనలో జగన్... తిరుమలకు చేరిక