తెదేపా హయాంలో 62 ప్రాజెక్టులకు రూపకల్పన చేశామని అచ్చెన్నాయుడు తెలిపారు. అందులో 19 ప్రాజక్టులు పూర్తి చేశామని... 30 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. ఏవైనా ప్రాజక్టులు కడితే... అందులో నీరుండేలా చూసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ ప్రభుత్వంతో మంతనాలు జరిపే ముందు చర్చలు జరపాలన్నారు. ఇదో విపత్కర పరిస్థితని హెచ్చరించారు.
బగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి దీనిపై స్పందిస్తూ... నదులన్నీ అనుసంధానం చేస్తే బాగుంటుందని వారికీ తెలుసని... పక్క రాష్ట్రాలతో ముడిపడిన సమస్యలను ఇతరులకు రుద్దాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో తెదేపా నేతలు తెలంగాణలో పట్టుబడి... ఆస్తులన్నీ వదులుకుని వచ్చారని బుగ్గన విమర్శించారు. వదిలి వచ్చిన ఆస్తులకు విద్యుత్ బిల్లులు కట్టేవాళ్లు లేరని బగ్గన ఎద్దేవా చేశారు.
దీనిపై అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... సభకు సూచనలు మాత్రమే ఇస్తున్నానని, విమర్శలు చేయటం లేదన్నారు.