Man commits suicide in Bapatla district: అనారోగ్యంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాపట్ల జిల్లా నిజాంపట్నం మండల కేంద్రంలో జరిగింది. అచ్చంపేట గ్రామానికి చెందిన మహేష్ (30) నిజాంపట్నంలోని ఓ రొయ్యల కంపెనీలో గుమాస్తాగా పని చేస్తున్నాడు. భార్య, పిల్లలతో కలిసి అక్కడే ఇల్లు అద్దెకు తీసుకుని జీవిస్తున్నాడు. పని నుంచి ఇంటికి వచ్చాక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య, పాప ఊరికి వెళ్ళి ఉండటంతో పోలీసులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అనారోగ్య సమస్య వలనే మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఏపీలో తెలంగాణకు చెందిన ఆర్.ఎం.పి ఆత్మహత్య: మంత్రాలయం పట్టణంలోని మహాలక్ష్మి లాడ్జ్ రూంలో ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా దొడ్డి సింధునూరు గ్రామానికి చెందిన ఆర్.ఎం.పి జె. కిషోర్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కిషోర్ కుమార్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒంటరిగా వచ్చిన వ్యక్తులకు అద్దె రూములు ఇవ్వరాదని పోలీసులు లాడ్జిల యాజమాన్యానికి గతంలోనే నోటీసులు జారీ చేశారు. అయినా పోలీసుల నోటీసులు పట్టించుకోవడం కోవడం లేదని, పోలీసులు సైతం ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే చర్యలు చేపడుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
ఇవీ చదవండి