ETV Bharat / state

Social Media Posts on Amarnath: 'నిన్ను కాపాడుకోలేక పోయాం.. మమ్మల్ని క్షమించు' - బాపట్ల వార్తలు

Tenth Class Student Amarnath Murder Case: చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. దీంతో ఇంటి బాధ్యతలు తీసుకున్నాడు. తన సోదరిని వేధిస్తున్న వారికి ఎదురెళ్లాడు. ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఆ అల్లరిమూకలు మాటు వేయడంతో వారి చేతిలో బలైన.. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలేనికి చెందిన అమర్‌నాథ్​ చూపిన తెగువను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పలు సందేశాలు వైరల్ అవుతున్నాయి.

Tenth Class Student Amarnath murder
పదో తరగతి విద్యార్థి అమర్‌నాథ్ హత్య కేసు
author img

By

Published : Jun 18, 2023, 8:02 AM IST

Social Media Posts Tenth Class Student Amarnath Murder: సైకోలా మారిన ఓ యువకుడి బారిన పడకుండా తన అక్కను రక్షించేందుకు ఎంతగానో పోరాడాడు ఆ బాలుడు.. ఎదురెళ్లి వారిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. కానీ ఆ అల్లరిమూకలు మాటువేసి చుట్టుముట్టేయడంతో అమర్‌నాథ్‌ అసువులు బాశాడు. ఆ బాలుడు చూపిన తెగువకు సమాజం జేజేలు కొడుతోంది. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలేనికి చెందిన అమర్‌నాథ్‌ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. కుటుంబానికి అన్నీ తానై అండగా ఉంటున్నాడన్న సంతోషం ఆ అమ్మకు, కుటుంబసభ్యులకు లేకుండా పోయింది. బాలుడి తెగువపై సోషల్‌ మీడియాలో పలు పోస్టులు బాగా వైరల్‌ అవుతున్నాయి..

‘‘చిరంజీవి అమర్‌నాథ్‌గౌడ్‌.. తండ్రి తర్వాత తండ్రిలా పెద్దరికం తీసుకుని సోదరిని ఆకతాయిల బారిన పడకుండా కాపాడుకోవాలనుకుని ఓ ముష్కరుడి చేతిలో చిన్న వయసులోనే సజీవ దహనమయ్యావు.. అక్కను, అమ్మను ఇక ఆదుకొనే వారు లేరు.. వారిని రోడ్డు మీదకు తోలేసిన సమాజంలో అమర్‌నాథ్‌ తన కుటుంబం కోసం చిన్న వయసులోనే ఎంతో ధైర్యసాహసాలు చూపించాడు. అందరూ అతని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.. సభ్యసమాజం సిగ్గుపడాలి.. వ్యవస్థలన్నీ సిగ్గుపడాలి.. నిన్ను కాపాడుకోలేని ఈ సమాజంలో మళ్లీ పుట్టొద్దురా చిట్టితండ్రీ.. అక్కడే ఉండు.. ఛీకొట్టు మమ్మల్ని.. శపించు..’’ అంటూ ఆ బాలుడి తెగువకు సామాజిక మాధ్యమాలలో ప్రశంసలు వెల్లువెత్తాయి.

Also Read: Petrol Attack: బాపట్లలో దారుణం.. పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్​ పోసి నిప్పు

ముగిసిన అంత్యక్రియలు: దారుణ హత్యకు గురైన పదో తరగతి విద్యార్థి అమర్‌నాథ్‌ మృతదేహానికి శనివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. విద్యార్థి అమర్‌నాథ్‌ మృతదేహం ఉప్పాలవారిపాలేనికి తరలించారు. మెుదట జీజీహెచ్ మార్చురీ నుంచి చెరుకుపల్లి మండలానికి తరలించారు. బాపట్ల జిల్లాలోని చెరుకుపల్లి అంబేడ్కర్‌ జంక్షన్​లో విద్యార్థి అమర్‌నాథ్‌ మృతదేహంతో టీడీపీ నేతలు, బీసీ సంఘాలు ఆందోళనకు చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు.

పోలీసు స్టేషన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను బలవంతంగా అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లారు. రేపల్లె ఆర్డీవో పార్థసారథి అమర్నాథ్‌ బంధువులతో చర్చలు జరిపడంతో.. ఆర్డీవో హామీ మేరకు అమర్​నాథ్ కుటుంబసభ్యులు అంతక్రియలు పూర్తి చేశారు.

Also Read: Student Murder: పూర్తైన అమర్నాథ్‌ అంత్యక్రియలు.. రూ.10లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం: రేపల్లె ఆర్డీవో

ఆర్థిక సాయం: అమర్నాథ్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 10లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుడి కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టిస్తామని, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అమర్నాథ్ కుటుంబానికి టీడీపీ తరఫున 5 లక్షల రూపాయల సాయాన్ని అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఈ సందర్భంగా అమర్నాథ్‌ హత్యతో వైసీపీ నాయకులకు సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. కొందరు వైసీపీ నేతల్ని కాపాడేందుకే పోలీసులు కేసును పక్కదోవ పట్టించేందుకు చూస్తున్నారని అనగాని ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.