ETV Bharat / state

TDP Sympathizers Votes Deletion: కొనసాగుతున్న టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు పర్వం.. ఫోర్జరీ సంతకాలతో దరఖాస్తులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 22, 2023, 10:18 AM IST

TDP Sympathizers Votes Deletion: టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు ప్రక్రియను వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తున్నారు. పర్చూరు నియెజకవర్గంలో వైసీపీ నేతల బరితెగింపు తారస్థాయికి చేరుకుంది. తమకి తెలియకుండానే వైసీపీ శ్రేణులు భారీగా ఫారం-7 దరఖాస్తులు దాఖలు చేస్తున్నారని టీడీపీ సానుభూతిపరులు ఆరోపిస్తున్నారు.

TDP Sympathizers Votes Deletion
TDP Sympathizers Votes Deletion

TDP Sympathizers Votes Deletion: టీడీపీ కంచుకోట అయిన బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు, తటస్థుల ఓట్లు తొలగించే కుట్ర కొనసాగుతోంది. కచ్చితంగా టీడీపీకే ఓటేస్తారనుకునే వారిని ముందే గుర్తించి.. జాబితా నుంచి వారి ఓట్లు తొలగించాలంటూ వైసీపీ నాయకులు భారీగా ఫారం-7 దరఖాస్తులు చేయిస్తున్నారు. టీడీపీ సానుభూతిపరుల సంతకాలు ఫోర్జరీ చేసి.. ఓటు తొలగింపునకు వారే దరఖాస్తు చేసుకున్నట్లు.. ఫారం-7లు పెడుతున్నారు. ఈ అక్రమాలు (Irregularities in Voter List) కొన్ని నెలలుగా కొనసాగుతున్నాయి. బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఓట్ల తొలగింపు కోసం మొత్తం 38 వేల 3వందల 11 ఫారం-7లు అందగా.. వాటిలో పర్చూరు నియోజకవర్గానివే 13 వేల 9వందల 52 ఉన్నాయి. వైసీపీ నాయకులే ఈ కుట్ర నడిపిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.

మార్టూరు మండలం తెలుగు మహిళా అధ్యక్షురాలు ఉప్పుటూరు రమాదేవి ఓటు తొలగించాలంటూ ఆమె పేరిటే గుర్తుతెలియని వ్యక్తి దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తు ఎవరు చేశారో తేల్చాలని అధికారులను ఆమె డిమాండ్ చేశారు. యద్దనపూడి మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడికి.. ఆయన స్వగ్రామంలో ఓటు ఉంది. ఓటర్ జాబితా నుంచి ఆయన పేరు తీసేయాలంటూ మరో వ్యక్తి ఫారం-7 సమర్పించారు. ఓటు తొలగింపు నోటీసు అందుకున్న ఆ ఉపాధ్యాయుడు విచారణకు హాజరై.. తన ఓటు ఎలా తీసేస్తారని అధికారులను ప్రశ్నించారు.

TDP Sympathizers Votes Deletion: దృష్టి మళ్లించి డబ్బులాక్కెళ్లే ముఠాలు! సందట్లో సడేమియాలు.. టీడీపీ ఓట్లను తొలగించే పనిలో వైసీపీ నేతలు!
యద్దనపూడి మండలం గంగవరానికి చెందిన నాదెండ్ల చంద్రశేఖర్‌కి అదే ఊరిలో ఓటు ఉంది. దాన్ని తొలగించాలంటూ ఆయన పేరిట ఎవరో దరఖాస్తు చేశారు. మార్టూరులో 20 ఏళ్లుగా ఉంటున్న చెప్పుల వ్యాపారి రామినేని శ్రీనివాసరావు దంపతుల ఓట్లను తొలగించాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు దరఖాస్తు చేశారు. విచారణకు హాజరైన ఆ దంపతులు అసలు తాము దరఖాస్తే చేసుకోలేదని చెప్పారు. జైభీమ్‌ భారత్‌ పార్టీ పర్చూరు నియోజకవర్గ కన్వీనర్‌ జెట్టి శివ ఓటు తొలగించాలంటూ ఆయన పేరిట ఎవరో దరఖాస్తు చేశారు. తానెందుకలా దరఖాస్తు చేస్తానని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పర్చూరు నియోజకవర్గంలో లెక్కలేనన్ని ఉన్నాయి.

పర్చూరు నుంచి టీడీపీ తరఫున ఏలూరి సాంబశివరావు ఇప్పటికే వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాబోయే ఎన్నికల్లో ఆయన విజయాన్ని అడ్డుకోవాలనే వైసీపీ నాయకులు అడ్డదారులు తొక్కుతూ.. ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వైసీపీ నాయకులు అడ్డగోలుగా ఫారం-7 దరఖాస్తులు చేయిస్తుండటంతో ఇప్పటికే కొన్ని ఓట్లు అదృశ్యమయ్యాయి. తమ ఓటు లేదని తెలుసుకున్న అనేక మంది తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో సర్కార్‌పై అసంతృప్తి ఉన్నందున వారి ఓట్లు తీసేయించేలా వారికి తెలియకుండానే దరఖాస్తులు పెడుతున్నట్లు సమాచారం.

Irregularities in Voter List దుకాణానికి ఇంటి నంబర్.. 100కి పైగా ఓట్లు! నంబరే లేని ఇంట్లో ఏకంగా 280..

ఫోర్జరీ సంతకాలు, తప్పుడు సమాచారంతో ఓట్ల తొలగింపు కోసం ఎవరైనా దరఖాస్తు చేసినా.. ఒకే వ్యక్తి తప్పుడు సమాచారంతో పదికి మించి ఫారం-7 దరఖాస్తులు చేసినా.. బాధ్యుల్ని ఎన్నికల అధికారులు గుర్తించి కేసులు నమోదు చేయాలి. పర్చూరులో మాత్రం ఒక్కరిపైనా కేసు పెట్టలేదు. వాటి వెనుక వైసీపీ నాయకులు ఉండటమే దీనికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Fake Voters List in Bheemili : '0.. 00.. 000..' ఇవన్నీ ఇంటి నెంబర్లే! భీమిలిలో వెలుగులోకి నకిలీ ఓటర్ జాబితాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.