School Bus Driver Died Due to Heart Attack: స్కూల్ విద్యార్థులతో పాఠశాలకు బయల్దేరిన పాఠశాల బస్సు డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిన ఘటన.. బాపట్ల జిల్లాలో కలకలం రేపింది. దాదాపు 45 మంది విద్యార్థులతో నిండి ఉన్న ఆ బస్సు డ్రైవర్ ఇలా గుండెపోటుకు గురికావటంతో.. బస్సులోని విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. బస్సులో అసలేం జరుగుతుందో అర్థంకాకా విద్యార్థులు గందరగోళ స్థితిలోకి చేరుకున్నారు. డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడని తెలియక విద్యార్థులు అటువైపుగా వెళ్లే స్థానికులకు పరిస్థితి వివరించగా.. అప్పటికే డ్రైవర్ మృతి చెందినట్లు వారు గుర్తించారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లాలోని అద్దంకి మండలం ఉప్పలపాడు గ్రామ శివారులోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సును.. అద్దంకికి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తి నడుపుతున్నాడు. ఎప్పటిలాగానే బల్లికురవ మండలం గొర్రెపాడు గ్రామంలో స్కూల్ విద్యార్థులను ఎక్కించుకుని బయలుదేరాడు. అదే దారిలోని ఉప్పలపాడు గ్రామంలోని మరికొంతమంది విద్యార్థులను ఎక్కించుకుని అక్కడి నుంచి పాఠశాలకు బయల్దేరాడు.
School Bus Accident: పంట పొలాల్లో పల్టీకొట్టిన స్కూల్ బస్సు.. 14మంది విద్యార్థులకు గాయాలు
ఈ క్రమంలో ఉప్పలపాడు గ్రామ శివారుకు చేరుకునే సరికి.. పాఠశాల బస్సు రోడ్డుకు అటూ ఇటూగా.. గతి తప్పుతున్న విధంగా నడవటాన్ని బస్సులోని విద్యార్థులు గమనించారు. బస్సు అదుపు తప్పుతోందని భావించి విద్యార్థులు ఆందోళనలతో కేకలు వేశారు. దీంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు.
ఏం జరిగిందోనని కొందరు విద్యార్థులు డ్రైవర్ దగ్గరికి వెళ్లి చూడగా.. సీటులో పక్కకి పడిపోయి ఉన్నాడు. దీంతో డ్రైవర్‌కు ఫిట్స్ వచ్చిందేమో అనుకుని.. అతని చేతిలో తాళాలు ఉంచారు. అప్పటికీ అతను స్పృహలోకి రాకపోయే సరికి.. అదే దారిలో వెళ్తున్న స్థానికులకు విద్యార్థులు జరిగిందంతా వివరించారు. ఈ క్రమంలో స్థానికులు సీట్లో పడి ఉన్న డ్రైవర్ దగ్గరికి వెళ్లి పరిశీలించారు.
School Bus Accident: పాఠశాల బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం
స్థానికులు చూసే సరికే డ్రైవర్ ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు గుర్తించారు. బస్సు అటుఇటూ కదిలిన సందర్బంలో ఏ విద్యార్థికి కూడా గాయలు కాలేదని.. అందరూ సురక్షితంగా ఉన్నారని స్థానికులు వివరించారు. ఈ ప్రమాదం సంభవించినప్పుడు మొత్తం 45మంది విద్యార్థులు బస్సులో ఉన్నారని సమాచారం.