ETV Bharat / state

బస్సును అధిగమించబోయి.. బైక్​ పైనుంచి పడి.. - bus and bike accident

A man died in bike accident at bapatla: తొందరపాటు ఓ వ్యక్తి ప్రాణాలు తీసి మరో వ్యక్తిని గాయాలపాలు చేసింది. ఈ ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. ద్విచక్రవాహనం పై వెళ్తున్న ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సును అధిగమించబోయే క్రమంలో అదుపు తప్పాడు. దీంతో బైక్ నడుపుతున్న వ్యక్తికి గాయాలు కాగా వెనక కూర్చున్న వ్యక్తి మృతిచెందాడు. మృతుడు కీర్తిపాటి సురేష్, గాయాలైన వ్యక్తి నూతలపాటి పృద్వీరాజ్ గా పోలీసులు తెలిపారు.

బస్ బైక్ ఢీ
bus bike accident
author img

By

Published : Oct 26, 2022, 7:25 PM IST

A man died in bike accident at bapatla: డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు, పెద్దలు ఎంత చెప్పినా వినకుండా ప్రమాదాలు కొని తెచ్చుకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు నేటి యువత. అలాంటి ఘటనే బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం గంగవరం వద్ద చోటు చేసుకుంది. బైకు మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు.. ఇంకొల్లు మీదుగా అద్దంకి వెళుతున్న ఆర్టీసీ బస్సును అధికమించే క్రమంలో బస్సుకు బైకు తగలటంతో అదుపుతప్పింది. దీంతో వాహనంపై వెనుక కూర్చున్న కీర్తిపాటి సురేష్(30) ఎగిరి బస్సు టైర్లకింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం నడుపుతున్న నూతలపాటి పృద్వీరాజ్​కు గాయాలయ్యాయి. మృతుడు సురేష్ జె.పంగులూరుకు చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి ఆర్టీసి బస్సు, డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని.. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.