Goods train: బాపట్ల జిల్లా వేటపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ రైలు చెన్నై నుంచి విజయవాడ వెళ్తుండగా వేటపాలెం వద్ద జంక్షన్ క్రాస్ అయ్యే సమయంలో ఈ ఘటన జరిగింది. నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో చెన్నై-విజయవాడ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలో వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సాయంత్రానికి సమస్యను పరిష్కరించి.. రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: ల్యాప్‌ట్యాప్ పేలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి తీవ్రగాయాలు.. పరిస్థితి విషమం