DETAH ANNIVERSARY CELEBRATIONS: పుట్టిన రోజు, పెళ్లిరోజు, షష్టిపూర్తి ఇలా పలు వేడుకల్ని అందరం జరుపుకుంటాం.. అందుకు సంబంధించిన పత్రికలను బంధువులకు పంచుతాము. కానీ.. బాపట్ల జిల్లా చీరాలలో ఓ వ్యక్తి మరణదిన వేడుకల ఆహ్వాన పత్రాలు పంచడం హట్‌టాపిక్‌గా మారింది. చీరాలలో పేరొందిన వైద్యుడు, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు ఈ వేడుకలను జరుపుకుంటున్నారు. ఉదయం 10 గంటలకు చీరాలలోని ఐఎమ్ఏ హాలులో జరిగే తన 12వ మరణదిన వేడుకలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికలు పంపిస్తున్నారు. తాను 75 ఏళ్లు జీవించాలని అనుకున్నానని.. ఇప్పటికే 63 పూర్తయ్యాయని అంటున్నారు. ఇంకా జీవించాల్సింది 12 ఏళ్లేనని చెబుతున్నారు. వచ్చే ఏడాది 11వ మరణ దినం జరుపుకుంటానని అంటున్నారు.
ఇవీ చదవండి: